జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారా... ఈ టిప్స్ ఫాలో అయితే జలుబు, జ్వరం మటుమాయం..!
ఆరోగ్యపరమైన సమస్యలు పిల్లలలో మరియు పెద్దలలో చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువగా జలుబు సమస్య బాధ పెడుతుంది. ఆహరపు అలవాట్లలో మార్పుల వలన, కొత్త నీళ్లు తాగినా, వాతావరణంలో మార్పుల వలన ఈ సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని జలుబు, జ్వరం తరచుగా వేధిస్తూ ఉంటాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే జలుబు, జ్వరాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు.
జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గించడానికి కిచెన్ లో వాడే యాలకులు, అల్లం అద్భుతంగా పని చేస్తాయి. జలుబు, ప్లూ లక్షణాలు అల్లం, యాలకులు కలిపి చేసిన టీ తాగితే తగ్గుముఖం పడతాయి. అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, యాలకులను బాగా దంచి వేడి నీటిలో ఆ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఆ మిశ్రమాన్ని నానబెట్టిన బెట్టిన తరువాత ఆ టీని తాగితే జలుబు, జ్వరం, దగ్గు తగ్గుముఖం పడతాయి.
నిమ్మ ఆకులు, దాల్చిన చెక్క, అల్లంతో చేసుకున్న టీ తాగితే జలుబు, దగ్గు, జ్వరం తగ్గుముఖం పడతాయి. ఒక కప్పులో వేడి నీళ్లు, ఒక వంతు అల్లం, రెండు వంతులు నిమ్మకాయ ఆకులు పేస్ట్ లా చేసుకొని వేడి నీళ్లలో పది నిమిషాల పాటు మిశ్రమాన్ని నానబెట్టాలి. టేస్ట్ కావాలంటే కొంచెం తేనె కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బేసన్ కా షీరా టీ తాగితే ముక్కు నుండి నీరు కారే సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.