అమ్మో షుగర్, బిపి లకు అవే కారణమా....??

Mari Sithara
ప్రస్తుత కాలం మనిషి తిండిలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, తాగే నీటిలో కల్తీ, ఇలా అన్నిటిలో కల్తీతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అనే రీతిన తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకప్పటి కాలంలో అయితే ఎక్కువగా పెద్దలకు మాత్రమే హృదయ సంబంధ వ్యాధలు, షుగరు, బిపి వంటివి వచ్చేవి. అయితే ఇవి నేటి కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా మనలో చాలామందికి సంక్రమిస్తున్నాయి అంటే, అందుకు నేటి మన జీవన శైలి మరియు పాటించే పద్ధతులే కారణం అని అంటున్నారు వైద్యులు. ఇక ఇటీవల చైనాలోని కొందరు శాస్త్రవేత్తలు, ప్రధాన వ్యాదులైన షుగర్, బిపి వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి గల కారణాలను కనుగొనడానికి, కొందరు వ్యక్తులను కొన్నాళ్ల పాటు తమ అధీనంలో ఉంచి, 

పలు విధాలుగా పరీక్షలు జరిపి, ఒక విషయం తేల్చారట. అదేమిటంటే, నేటి కాలంలో ఎక్కువగా ఈ రెండు వ్యాధులు మనలో ప్రబలడానికి కేవలం మన ఆహారపు అలవాట్లు మాత్రమే కాక సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి ఇతర మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా కొంతవరకు కారణమని తేలిందట. ఎక్కువగా మొబైల్ వినియోగించేవారి పై ఇవి మరింతగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉందట. కొందరు తమ ఫోన్ లో సెల్ సిగ్నల్ లేదని, అలానే ల్యాప్టాప్ వాడే సమయంలో దానికి వైఫై సిగ్నల్ వంటివి లేకపోయినప్పటికీ కూడా వాటిని అలానే వాడుతుంటారు, దానివలన వాటిలో వేడిమి పెరగి, అనంతరం వాటిలోని తరంగాల ప్రవాహం అనేది మరింత పెరుగుతుందట. దానివలన ఆ తరంగాలు మన మెదడు పై కొంత ప్రభావాన్ని చూపి మనకు ఒత్తిడి, ఆందోళన, 

మానసిక వేదన వంటి సమస్యలకు దారి తీస్తున్నాయని, తద్వారా ఈ షుగర్, బీపీ వంటివి మనలో ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. అంతేకాక ఎక్కువగా జంక్ ఫుడ్ వంటివి తినడం మరింతగా ఇప్పటివారిలో మితిమీరుతోందని, దానివలన సరైన పోషకాలు మన శరీరానికి అందకపోవడం వంటివి జరిగి ఈ విధమైన వ్యాధుల బారిన పడుతున్నారని తేల్చిందట. అయితే అవసరాన్ని బట్టి మాత్రమే మొబైల్ ఫోన్ వాడకం, అలానే ఎక్కువగా సాత్వికాహారం తీసుకోవడం, ఇక నిత్యం వ్యాయామం వంటివి చేయడం ద్వారా ఈ రెండు భయంకర వ్యాధుల బారిన పడకుండా కొంతవరకు తప్పించుకోవచ్చని వారు చెప్తున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: