మలబద్ధకం సమస్య ఈజీగా పోవాలంటే..?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మందికి కూడా కడుపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆ సమస్యల కారణంగా ఎక్కువ ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు ఖచ్చితంగా మలబద్ధకం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో మార్పులు చేసుకోవటం మంచిది.ఇప్పుడు వేసవి కాలం ప్రారంభం కానుంది. కాబట్టి మీరు పెరుగు, అరటిపండును సరిగ్గా ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఈ రెండు  మార్కెట్లో చాలా చౌకగా లభిస్తాయి కూడా. మీ శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. వీటితో మలబద్ధకం సమస్యను నివారించగలుగుతారు..ఇక మలబద్ధకంతో బాధపడేవారు అల్పాహారంలో అరటిపండు ఇంకా పెరుగు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రెండు ఆహారాలు మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.


అరటిపండు, పెరుగు కలిపి తింటే చాలా లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదనంగా, ఇందులో విటమిన్లు, కాల్షియం ఇంకా ఖనిజాలు కూడా ఉన్నాయి. అరటిలో ఐరన్, విటమిన్లు ఇంకా ఫైబర్ ఉన్నాయి. అందుకే ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మీరు అల్పాహారం సమయంలో ఈ రెండు ఆహారాలను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోజంతా కూడా మీకు శక్తి లభిస్తుంది.అరటిపండ్లు తినడం వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్,అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా, కాల్షియం శోషణ అనేది జరుగుతుంది. అల్పాహారంలో అరటిపండు, పెరుగు చేర్చడం వల్ల మీ ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి.అరటిపండుతో పాటు పెరుగు తింటే ఖచ్చితంగా కొవ్వు కరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇంకా అదే సమయంలో, దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: