జ్వరం వస్తే మాంసాహారం తినకూడదా..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలా.. వద్దా.. అనే విషయానికి వస్తే చికెన్ తినాలి అనుకునేవారు బాగా మసాలాలు దట్టించి, ఎక్కువ నూనె వేసి వేయించుకొని తినడం వల్ల తప్పకుండా అనారోగ్యం బలపడుతుంది. కాబట్టి నూనె తక్కువ వేసుకొని కేవలం ఉప్పు, కారం వంటి మసాలా తో మాత్రమే చికెన్ వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు చికెన్ నుంచి లభించే ఫైబర్, ప్రోటీన్ వల్ల మనకు శక్తి కూడా వస్తుంది.
చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి రావడంతో పాటు నీరసించిపోయిన శరీరానికి మంచి ఉపశమనం దొరుకుతుంది. చికెన్ సూప్ లో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి కాబట్టి నీరసం కాస్త తొలగిపోయి జ్వరం వచ్చిన వ్యక్తి యాక్టివ్ గా ఉండడానికి దోహదపడుతుంది. పైన చెప్పిన విధంగా చికెన్ సూప్ చేసుకొని తాగడం వల్ల జ్వరం వచ్చినప్పుడు మరింత శక్తి చేకూరుతుంది.