టెడ్రోస్ : కరోనా అంతం.. మన చేతులలోనే ఉంది.. !

Chandrasekhar Reddy
కరోనా అంతం ఎప్పుడు అని అందరు నన్ను అది వచ్చినప్పటి నుండి అడుగుతూనే ఉన్నారు. నేను కూడా అప్పటి నుండి చెపుతూనే ఉన్నాను, మనం ముందస్తు జాగర్తలు పాటించడం వలన అదే వెళ్ళిపోతుంది అని. కానీ ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు. కాస్త తగ్గుముఖం పట్టగానే బయటకు వచ్చేస్తున్నారు, నిబంధనలు పాటించకుండా తిరిగేస్తున్నారు. దీనితో మళ్ళీ అది విజృంభిస్తుంది. ఇలా అయితే మనిషి ఉన్నంత కాలం అది ఉంటుంది. దానిని పూర్తిగా వెళ్ళగొట్టాలి అంటే మనిషి ముందు నిబంధనలు కనీసం ఏడాదైనా పాటించాల్సి ఉంటుంది. అది లేకపోబట్టే ఇప్పటికి రోజు సాలీనా 50000 మంది ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందుతూనే ఉన్నారు.
మహమ్మారి ని తరిమికొట్టడానికి మన వద్ద అన్నీ ఉన్నప్పటికీ కేవలం అజాగర్త వలన రోజూ ఇంతమంది మృతికి కారణం అవుతున్నాం. ఈ విషయం ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే దానిని అంతం చేయడం ప్రారంభం అయినట్టు. మనిషి దగ్గర సమర్ధవంతమైన ఔషదాలు, సాధనాలు, వంటివి ఎన్నో ఉన్నప్పటికీ, కాస్త నిబంధనలు పాటించే ఓపిక మాత్రం ఉండటం లేదు. అదొక్కటి తోడైతే వీలైనంత త్వరగా దానిని ప్రపంచం నుండి తరిమేసి, మళ్ళీ అందరు సాధారణ జీవితం గడపడానికి అవకాశాలు ఏర్పడతాయి. లేదంటే ఒకచోట విజృంభించినా అది ఎప్పడు ఇతర ప్రాంతాలకు పాకేస్తుందో చెప్పడానికి వీలులేదు.  
నిర్లక్ష్యంతో అందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. {{RelevantDataTitle}}