ఇలా చేసి చేస్తే చిటికెలో పంటి నొప్పి మాయం...

Purushottham Vinay
ఒక ఐస్‌ ముక్కని తీసుకోని ఓ క్లాత్‌లో పెట్టుకోని వాటిని నొప్పి ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్దుతూ ఉండాలి.ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్తనాళాలు ఇంకా రక్త ప్రసరణ అనేవి మెరుగుపడి నొప్పి ఇంకా మంట అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా వాపు కారణంగా వచ్చే పంటినొప్పికి ఇది ఓ చక్కటి చిట్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక అలాగే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా పంటినొప్పి అనేది చాలా ఎక్కువవుతుంది. ఇక అలాంటి సమయంలో వేడినీటిని తీసుకోని అందులో ఓ చిటికెడు ఉప్పుని వేసి ఇక ఆ నీటిని ఒక పదినిమిషాలపాటు బాగా పుకిలించి ఉంచాలి. ఇలా రోజులో మీకు వీలైన నన్నిసార్లు చేయడం చాలా మంచిది.దీంతో మీకు ఆ పంటి చుట్టూ వుండే ఇన్ఫెక్షన్‌కు కారణమైన అనేక క్రిములు అనేవి వెంటనే నశించడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైన ఆహార పదార్థం కనుక మీ పళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా కాని అది వెంటనే బయటకు వచ్చేస్తుంది. దాంతో మీ పంటి నొప్పి సమస్య అనేది తక్షణమే తీరిపోతుంది.

ఇక అలాగే భరించలేని పంటినొప్పితో బాధపడేవారికి వెల్లుల్లి కూడా బాగా పనిచేస్తుంది. ఇక ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు బాగా విపరీతమైన పంటి నొప్పి వచ్చిన వారు వెల్లుల్లిని బాగా దంచి దాన్ని కాస్త ఉప్పు లేదా మిరియాల పొడితో కలిపి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో దాన్ని రాయాలి. ఇలా చేస్తే కనుక చేస్తే తక్షణమే పంటి నొప్పి నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది.ఇక అయితే, వెల్లుల్లిని మీరు కచ్ఛితంగా దంచాలి. ఇక ముక్కలుగా కోయడం వల్ల మీకెలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఒకవేళ అలా కనుక కుదరకపోతే వెల్లుల్లిని కనీసం పంటితో నమిలే ప్రయత్నం అయినా మీరు చేయాలి.ఇక ఈ చిట్కాలు మీకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా కాని ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు పంటి నొప్పి కనుక వేధిస్తే.. వెంటనే వైద్యులను కలిసి మీరు చికిత్స తీసుకోవాలి. అలాగే పంటినొప్పి సమస్య అనేది బాగా ఉన్నవారు ఎక్కువగా చక్కెర ఉన్న పదార్థాలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: