బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం..రోజుకు ఒకలా వుంటాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పైకి కదిలాయి. ఇక వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్పంగా కిందకు దిగి వచ్చాయి..హైదరాబాద్ మార్కెట్‌లో 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా నమోదైంది. ఇక వెండి ధర తగ్గింది. మీరు కూడా బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..
భారత్‌లో బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 నుండి ఆదివారం నాటికి 47,550కి పెరిగింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారం రోజున రూ.51,760 ఉండగా, ఆదివారం రూ. 51,870 పలికింది..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది..
అదే విధంగా హైదరాబాద్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,550 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,550 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి..ఇక వెండి ధరలు నేడు మార్కెట్ లో స్వల్పంగా తగ్గాయి.చెన్నైలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, కోల్‌కతాలో రూ.59,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, కేరళలో రూ.65,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,700 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..