గుడ్ న్యూస్ : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు

Vimalatha
భారతీయులు ఎంతో ఇష్టపడే వాటిలో బంగారం, వెండి ఆభరణాలు చాలా ముఖ్యమైనవి. ఇండియాలో ఎలాంటి వేడుకలు జరిగినా సరే అందులో ముఖ్యంగా బంగారం, వెండి ఉండాల్సిందే. అందుకే ఇండియాలో వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు చూస్తుంటే బంగారం, వెండి కొనాలనుకునేవారు వెనకడుగు వేయాల్సి వచ్చేలా ఉంది. గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం కాస్త తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.300 తగ్గింది. తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగుళూరులలో కేజీ వెండి రూ.67,050గా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో మాత్రం కేజీ వెండి రూ.72,000 ఉంది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770గా ఉంది. ఈ రోజు మన దేశంలోని ముఖ్యమైన సిటీల్లో బంగారం ధరలు...
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,310
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,870

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: