పసిడి ధరలకు బ్రేకులు.. వెండి అదే దారిలో.. !!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. అదే విధంగా వెండి ధరలు కూడా పడిపోయాయి..దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. అయితే శుక్రవారం బంగారం ధరలు తగ్గాయి. దీంతో మహిళలలు గోల్డ్ ను కొనడానికి క్యూ కడుతున్నారు..


హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల బంగారం ధరపై 400 వరకు తగ్గింది..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది. ఇక వెండి ధరల ను ఒకసారి చూస్తే..తాజాగా శుక్రవారం దేశీయం గా కిలో వెండి ధరపై దాదాపు 1300 రూపాయల వరకు తగ్గింది. బంగారం తో పాటు వెండి కూడా అదే బాటలో పయనించి.. కిలో ధర పై రూ.1287 తగ్గి ప్రస్తుతం 71, 924కి చేరింది.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి 1900 డాలర్లు పలుకుతుండగా.. ఔన్సు వెండి ధర 27.70 డాలర్లుగా ట్రేడవుతున్నట్టు వెల్లడించింది.. ఇకపోతే బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయ ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు ల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తత లు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. ఇకపోతే బంగారం, వెండి ధరలు ఈరోజు మార్కెట్ లో తగ్గాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: