పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..!
ఇండియన్ మార్కెట్ బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేవని తెలుస్తుంది. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం కొనసాగుతున్న బంగారం ధరలను పరిశీలిస్తే..స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.45,700 వద్ద ఉంది. బుధవారం కూడా ఇదే ధర ఉండడం విశేషం. అంతకుముందు రోజు బంగారం రూ.180 తగ్గి ఈ రేటు వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.41,900కు చేరగా.. గురువారం కూడా అదే రేటు స్థిరంగా ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది.వెండి ధర కిలోకు రూ.700 వరకూ తగ్గడం విశేషం. తాజాగా మార్చి 25న కిలో వెండి ధర రూ.69,700కు చేరింది. ఇందుకు కారణం వెండి వస్తువుల పై డిమాండ్ తగ్గడం ప్రధానంగా చెప్పవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఒక ఔన్స్‌కు 0.40 శాతం పెరిగి.. 1733 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఓ ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 25.07 చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు తదితర అంశాలు ధరల పై మార్పులు చూపిస్తున్నాయి మరి రేపు బంగారం , వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..