గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎందుకు అంతగా పెరిగాయో తెలుసా...?

Suma Kallamadi

బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద వారికి, మధ్య తరగతి వారికి బంగారం కొనలేని స్థాయికి ధరలు చేరుతున్నాయి. శుక్రవారం నాడు మార్కెట్ ముగిసే సమయానికి ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు నెల కి గోల్డ్ ఫీచర్స్ లో 0.6 శాతం పెరిగి రూ. 51,010 కు చేరుకుంది. అలాగే ఇక ఇంట్రా ట్రేడింగ్ టైంలో గరిష్టంగా రూ. 51,184 కూడా చేరుకుంది. ఇక మరోవైపు వెండి ధర చూసుకుంటే రాకెట్ వేగంతో ముందుకు తీసుకు వెళుతుంది. కిలో వెండి ధర రూ. 61 వేల పైన పలికింది. గత వారం రోజుల్లో పోలిస్తే బంగారం ధర 4 శాతం పెరగగా, వెండి ఏకంగా 15 శాతం పెరిగింది.

 


ఇక శుక్రవారం నాటి మార్కెట్ ముగిసిన తర్వాత హైదరాబాద్ బంగారం మార్కెట్ లో ఏకంగా రూ. 720 పెరిగి ఆల్ టైం హైగా 53 వేల పైగా ధర పలికింది. అయితే వెండి కిలో రూ 900 తగ్గి 61,100 కు చేరుకొంది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1900 పెరగా 22 క్యారెట్ల బంగారం రూ. 1500 పెరిగింది. ఇక వెండి పరిస్థితి చూస్తే ఏకంగా కిలో వెండి ధర రూ 9 వేల వరకు పెరిగింది.

 

 

ఇక మరోవైపు ఈ సంవత్సరం మొదటి నుండి చూస్తే బంగారం ధరలు ఏకంగా 30 శాతం పెరిగాయి అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తొమ్మిది సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1904 డాలర్లకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా 23 డాలర్లకు పైగా చేరింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యంగా కరోనా వైరస్ అని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు బంగారం సురక్షిత పెట్టుబడి అని భావించి ఇన్వెస్టర్ల అందరూ వాటి వైపు దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: