నిరుద్యోగులకి అమెజాన్ భారీ ఆఫర్...6500 ఉద్యోగాలు.

Bhavannarayana Nch

ఈ కామర్స్ రంగంలో అమెజాన్ కి ఉన్నంత క్రేజ్ మరే సంస్థకి లేదు..అమెజాన్ పాతుకు పోయినట్టుగా మరే సంస్థ కూడా అమెజాన్ కి పోటీగా నిలవలేక పోతోంది..ఇప్పుడు తమ ద్వారా మార్కెట్ ని మరింతగా విస్తరించడానికి మరింత డెలివరీ స్టేషన్లు పెట్టడానికి.. 6500 మందిని తాత్కాలిక  ప్రాతిపదికన తీసుకుంటోంది.

 

ఈ నెల 20 నుండి 24వ, తేది వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ను నిర్వహిస్తోంది..ఈ సందర్భంగా ఈ  తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది...ఆ సీజనల్‌ నియామకాల్లో భాగంగా సీజనల్‌ పొజషన్స్‌ కోసం 6500 మందిని విధుల్లోకి తీసుకుంటున్నామని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు..అమెజాన్ చేపట్టే ఈ నియామకాలు  ఫుల్‌ఫిల్మెంట్‌ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, సార్టేషన్‌ సెంటర్లలో ఉంటాయని తెలిపారు..

 

ఈ కామర్స్ లో అత్యధికంగా డిమాండ్ ఉండేది ‘”అమెజాన్ సేల్స్ టైం లో” ఈ సమస్యని అధిగమించడానికి..సుమారు 1000 మంది అసోసియేట్స్‌ను నియమిస్తామని చెప్పారు...గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొంది..మా ద్వారా కస్టమర్స్ మరింత మెరుగైన సేవలు అంది పుచ్చుకోవాలి అనేది మా ఉద్దేశ్యం అని తెలిపారు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: