మోడీ హైట్రిక్‌..రాహుల్‌ కు రెండు చోట్ల అగ్ని పరీక్షే ?

Veldandi Saikiran

భారతదేశ వ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి చెప్పుకుంటున్నారు.  అటు గెలుపుపై... అన్ని పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో  జాతీయ స్థాయిలో ఏ నాయకుడు విక్టరీ కొడతాడని... ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అందగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ ఫలితాల ప్రకారం... అన్ని రిపోర్టులు  ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఇక... భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ... ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారని అందరూ చర్చించుకుంటున్నారు.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారట.  వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా బిజెపి పార్టీ శ్రేణులు సైతం నరేంద్ర మోడీకి ఎంత మెజారిటీ వస్తుందో అని... ఒక అంచనాకు వస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా నరేంద్ర మోడీకి అనుకూలంగా రావడం జరిగింది.

 ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు చోట్ల  కాంగ్రెస్ అగర నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. 2019 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని తమ కంచుకోట అమెటి లో పోటీ చేసి రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి రాయిబరేలి నుంచి తొలిసారిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బిజెపి పార్టీ తరఫున దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గెలవడం చాలా కష్టమని సర్వేలు చెబుతున్నాయి.

అటు కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు.  కేరళలో రాహుల్ గాంధీ మరోసారి గెలవనున్నట్లు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే... 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఇప్పుడు కూడా కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి.. గెలవబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: