ఎన్నికల కౌంటింగ్: పల్నాడులో పక్కా ప్లాన్ తో భారీ బందోబస్త్?

Purushottham Vinay
ఎన్నికల కౌంటింగ్ వేళ అధికారులని పల్నాడు జిల్లా వణికిస్తోంది. కాబట్టి ఆ జిల్లాపై అధికారులు బాగా ఫోకస్ పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నరసరావుపేట మండలం కాకాని గ్రామ పరిధిలోని జెఎన్‌టియు కాలేజీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు అనగా మంగళవారం జరగనుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు తరువాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియనేది పూర్తవగానే విజేతల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. స్ట్రిక్ట్ గా కౌంటింగ్‌ కేంద్రం, పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి టేబుళ్ల వద్దకు తీసుకురాగానే సీళ్లు సరిగా ఉన్నాయా? లేదా? అనేది కౌంటింగ్‌ సూపర్వై జర్‌ చెక్ చేసి కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో సీళ్లు తెరుస్తారు. తరువాత ఓట్ల లెక్కిస్తారు.చిలకలూరిపేట నియోజకవర్గం నుండి మొదటి ఫలితం వెలువడుతుంది. ఎక్కువగా పోలింగ్‌ కేంద్రాలున్న గురజాల నియోజకవర్గం ఫలితం చివరగా వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 1929 పోలింగ్‌ కేంద్రాల్లో 14,86,594 మంది ఓటు హక్కును వినియోగించుకోగా రికార్డు స్థాయిలో 86.06 శాతం పోలింగ్‌ జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కింపునకు మొత్తం 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.ఓట్ల లెక్కింపుకు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం 14 మంది చొప్పున 7 నియోజకవర్గాలకు 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.


ఒక్కో రౌండ్‌ 20 నిమిషాల నుంచి 30 నిముషాల సమయం పడుతుంది. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక పరిశీలకునితో కలిపి ముగ్గురు సిబ్బందిని పెట్టారు.మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు  700 మంది ఉద్యోగులను నియమించారు. పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఒక్కొక్క అభ్యర్థికి, కౌంటింగ్‌ ఏజంట్లకు కనిపించేలా చేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు గంట ముందు ఏజెంట్లు కౌంటింగ్‌ హాల్‌ వద్ద అనుమతి పత్రంతో వెళ్ళాలి. ఏజెంట్లు నియమించిన వ్యక్తి నచ్చకపోతే సంబంధిత ఫామ్‌ పూర్తి చేసి మరో ఏజెంట్‌ నియమించుకోవచ్చు.ఒక టేబుల్‌ వద్ద పెట్టిన ఏజెంట్‌ మరో టేబుల్‌ వద్దకు వెళ్లకుండా నిబంధనలపై ఇప్పటికే అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం లోపలకు ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌, పేలుడు స్వభావం ఉన్న వస్తువులను అస్సలు అనుమతించరు. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు పొందిన పార్టీలు ఇంకా స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఏజెంట్లకు కుర్చీలు ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భ్రదపరిచిన కేంద్రాల వద్ద సిసి కెమెరాల నిఘా స్ట్రిక్ట్ గా ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, అర్మ్డ్‌ రిజర్వ్‌ ఇంకా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: