ఆ పోస్ట్ లకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటి....!!

murali krishna
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఐనటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను iitr.ac.in సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 30, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. గ్రూప్ బి మరియు సి పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నడుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ ఎ పోస్టుకు 31 ఖాళీలు, గ్రూప్ సికి 47 ఖాళీలు నిర్ణయించారు.
ఐతే దానికి సంబంధించి దరఖాస్తు ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. OBC / EWS కేటగిరీకి రూ. 400 ఫీజు చెల్లించాలి. అదే సమయంలో, sc / st / PWD మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించబడ్డారు.
దరఖాస్తు ఎలా చేయనుకోవాలి అంటే
Step 1: అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ iitr.ac.inని సందర్శించండి.
Step 2: తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: అభ్యర్థులు దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4: ఇప్పుడు అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోండి.
Step 5: అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
Step 6: ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించండి.

Step 7: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. చివరగా, అభ్యర్థి దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఐతే దానిలో ఉన్న విభాగాల వారీగా ఖాళీల వివరాలు….
1. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 10
2. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 02
3. అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ - 01
4. జూనియర్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ - 01
5. కోచ్ - 02
6. స్టాఫ్ నర్స్ - 02
7. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 01
8. జూనియర్ సూపరింటెండెంట్ - 12
9. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 23
10. డ్రైవర్ - 01
11. జూనియర్ అసిస్టెంట్ - 23
మొత్తం - 78
కనుక అర్హత కలిగిన వారందరు అప్లై చేసుకోవాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయటం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: