తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ పరీక్ష తేదీలు..!!

Divya
తెలంగాణ లో చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయ పడుతూనే ఉన్నది. ఇక పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ అని కూడా తగిన విధం లోనే నిర్వహిస్తూ.. విద్యార్థులను ఒత్తిడి లేకుండా చేస్తోంది. అయితే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క పరీక్ష తేదీలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో జరిగే ఎంసెట్, ఈసెట్ పరీక్ష తేదీలను కూడా కొద్ది నిమిషాల క్రితమే ప్రకటించడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

తెలంగాణలో జరిగే ఎంసెట్, ఈసెట్ పరీక్ష తేదీలను గత కొద్ది నిమిషాల క్రితం వెల్లడించడం జరిగింది.. జూలై 13 వ తేదీన ఈసెట్ జరగనుండగా.. జూలై 14వ తేదీన ఎంసెట్ జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. జులై 14 ,15 వ తేదీన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు కూడా జరపనున్నట్లు తెలియజేశారు. జూలై 18,19,20 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఖరారైన తేదీలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ తేదీలను ప్రకటించినట్లుగా ఆమె తెలియజేయడం జరిగింది.
కాగా ఎంసెట్ పరీక్షలు 28 ప్రాంతీయ సెంటర్లలో 105 కేంద్రాలుగా జరుపనున్నట్లు తెలియజేశారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసినట్లు మంత్రి తెలియజేయడం జరిగింది. ఈసారి ఎంసెట్ పరీక్షలు పూర్తి అయిన నెల రోజుల లోపే వారి యొక్క ఫలితాలను కూడా విడుదల చేస్తామని తెలియజేసింది. అంతేకాకుండా అధికారులకు కూడా ఈ విషయాన్ని సూచించినట్లు ఆమె తెలియజేసింది. ఈసారి ఇంటర్ మార్కులు వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని తెలియజేశారు. అయితే విద్యార్థులు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది అని చెప్పవచ్చు.. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఒక పద్ధతిగా పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: