ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో ఎత్తి వేస్తున్నట్టు కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించింన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ఎత్తివేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా సంస్థలన్నీ జూలై 1నుండి ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు తెరవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అంతే కాకుండా ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో సరైన వసతులు లేవని... పారిశుధ్య సమస్య ఉందని అంటున్నారు. మొదట రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పారిశుద్ధ్య సమస్య తీర్చిన తర్వాత స్కూల్ లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
జూలై 1 వరకు స్కూల్ ల పారిశుద్ధ్య సమస్య తీర్చాలని స్కూల్ లను ప్రారంభించాలని అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మద్యాహ్న భోజన బియ్యం ను వెనక్కి పంపి కొత్త బియ్యం పంపించాలని కోరారు. ఇక పిల్లలను స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూండా భయపడుతున్నారు. దీనిపై పిల్లల తల్లి దండ్రల సంఘం నేడు సమావేశమైంది. పాఠశాలలను ప్రారంభించడం ఉత్తమమా..? లేదంటే ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం ఉత్తమమా అని తల్లి దండ్రులు ఆలోచనలో పడ్డారు.
అంతేకాకుండా స్కూల్ లో పనిచేసే టీచర్లు ఇతర సిబ్బందికి పూర్తిగా వ్యాక్సినేషన్ ఇప్పించాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 27 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని.... ప్రైవేట్ స్కూళ్లలో రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని వారికి వ్యాక్సిన్ లు వేయాలని కోరుతున్నారు. లక్ష మంది సిబ్బందికి కూడా పూర్తి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. టీచర్లను స్కూల్ లో పనిచేసే సిబ్బందిని రిస్క్ రేకర్ లుగా చేర్చాలని కోరుతున్నారు. ఈ రోజు సాయంత్రం విధివిధానాలు ఖరారు కోసం తల్లి దండ్రులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు.