నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగం..

Satvika
నిరుద్యోగులకు ఈ వార్త సంతోషాన్ని ఇస్తుంది. కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న యువతకు ఇప్పుడు వినిపిస్తున్న వార్త కొండంత బలాన్ని ఇస్తుంది. భారత ప్రముఖ బ్యాంకుల లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 19 ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగాల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది..

ఈ బ్యాంకు లో మొత్తం ఖాళీలు 19.. మర్చెంట్ బ్యాంకర్‌, రిసెర్చ్ అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సీఏ లేదా ఎంబీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిసెర్చ్ అనలిస్ట్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండి కనీసం 4 సంవత్సరా ల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు..

సిస్టమ్ ఉద్యోగాల కోసం పీజీ, ఏదైనా గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణత సాధించాలి. 30 సంవత్సరా ల లోపు వయసు కలిగి ఉండాలి. అంతేకాదు కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ లో అనుభవం కలిగి ఉండాలి. ఎస్ఓ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి కనీసం సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి రూ.2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు జీతాన్ని పొందవచ్చు.రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.indbankonline.com/ వెబ్ సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఉద్యోగ అవకాశాల వల్ల కొంతవరకు మేలు జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: