నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు..!!
ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నవారికి గుడ్ న్యూస్. భారతదేశంలో విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. సైంటిస్ట్, సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.calicut.nielit.in/nic/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. మొత్తం ఖాళీలు 495 ఉండగా.. అందులో సైంటిస్ట్ బీ 288మరియు సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ 207 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. సైంటిస్ట్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్ బీ లెవెల్ లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్స్ లేదా గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఈ, ఎంటెక్ లేదా ఎంఫిల్.
సైంటిఫిక్ / టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్లో ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీఈ, బీటెక్. అలాగే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.800 చల్లించాలి. మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వయస్సు విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు. దివ్యాంగులకు 40 ఏళ్లు ఉండాలి.