విద్యార్థులకు కీలక ప్రకటన.. ఇక ఆటల్లేవ్..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా స్కూళ్లు cbse సిలబస్ ప్రకారం నడుపు తున్నాయి. ఇప్పుడు ఈ స్కూళ్ల వారికి సంబంధించి కీలక మైన ప్రకటన వచ్చింది. దీని ప్రకారం ఫిబ్రవరి విద్యార్థులకు ఇంపార్టెంట్ గా మారింది.

 

కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి అంటే సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయి.ప్రధాన సబ్జెక్టులు మాత్రం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయి. పన్నెండో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. 

 

అందులో ప్రధాన పరీక్షలు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ఉంటాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ మంగళవారం పరీక్షల కాలపట్టికను విడుదల చేసింది. ఇక విద్యార్థులూ.. పరీక్షలకు సిద్దం కండి.. ప్రణాళిక బద్దంగా చదివితే విజయం తప్పకుండా మీదే.. ఆల్ ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: