బీజేపీ మార్క్ రాజకీయం షురూ..? అలెర్ట్ అయిన చంద్రబాబు, రేవంత్..?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టింది.  జమిలి దిశగా కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ సారి తమ బలం చాటుకోవటం మోదీ - షా ద్వయానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రతీ అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు.


బీజేపీ నాయకత్వం ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో గేర్ మార్చుతోంది.  ఏపీలో కూటమిగా.. బీజేపీలో ఒంటరిగా రెండు రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలతో భవిష్యత్ పైన మరింత అంచనాలు పెరిగాయి. దీంతో, రెండు రాష్ట్రాల్లో కీలకమైన సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ, ఏపీలో బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం మొదలు కొత్త లక్ష్యాల వరకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వచ్చే సంక్రాంతి నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించనుంది.



తెలంగాణలో బీజేపీ బీసీ సమీకరణం పైన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కొత్తగా బీసీ నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల సమయంలో అమలు చేసిన సమీకరణాలు కొంత మేర కలిసి వచ్చాయి.  రాష్ట్ర పార్టీలో నెలకున్న అంతర్గత విభేదాలను పరిష్కరించి..నేతలను సమన్వయం చేసుకుంటూ.. కాంగ్రెస్ - బీఆర్ఎస్ ను సమర్ధవంతంగా ఎదుర్కునే నేత వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది.



ఏపీలో ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. కానీ, సొంతం గా పార్టీ బలం పెంచుకోవాలని.. వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలనేది బీజేపీ నేతల లక్ష్యం. ఇందు కోసం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరి ని ఎంపిక చేస్తోంది. ఒక రెడ్డి, మరో బీసీ నేత పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పొత్తు ఉన్నా..భవిష్యత్ రాజకీయాల పైన ఫోకస్ పెట్టిన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరి స్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరెస్సెస్ బీజేపీకీలక భూమిక పోషించేలా కార్యచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు - రేవంత్ బీజేపీ వ్యూహాలను గమనిస్తూ అలర్ట్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: