2024లో ఇంటర్నెట్లో ఎక్కువ వెతికిన.. టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?

praveen
ఈ 2024 అనేక సంఘటనలు, ఆవిష్కరణలు, వేడుకలు, ఆటగాళ్ల రికార్డులకు వేదికైంది. త్వరలో అందరూ 2025కి స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2024లో ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు? అనే విషయంపై జనాలు ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటివారికోసమే ఈ కధనం. మరోవైపు గూగుల్ ఇండియా కూడా ఈ సంవత్సరంలో జనాలు ఎక్కువగా ఎవరిగురించి వెతికారో ఆ వ్యక్తులకు సంబందించిన లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో రెజ్లర్, పొలిటీషియన్ అయిన వినేష్ ఫోగట్ 2024 లో గూగుల్ లో ఎక్కువగా వెతికిన వ్యక్తిగా నిలవడం విశేషం.
అవును, ఈ 2024లో టాప్ 10 సెర్చ్డ్ ఇండియన్ పర్సనాలిటీస్ లో వినేష్ ఫోగట్ తో కలిపి మొత్తం ఐదుగురు  స్పోర్ట్స్ పర్సన్స్ ఉండడం కొసమెరుపు. అయితే ఈ లిస్టులో మీరు ఉహిస్తున్నట్టు భారత స్టార్ క్రికెటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి వారు లేకపోవడం గమనార్హం. అవును, ఈసారి భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జనాలు ఎక్కువగా వెతికిన లిస్టులో నాలుగో స్థానంలో నిలిచారు. హార్ధిక్ పాండ్యా ఫామ్, విడాకులు, ఐపీఎల్ కెప్టెన్సీ వంటి అంశాలతో అతను గూగుల్ లో వెతికిన టాప్ 10 పర్సనాలిటీస్ లో ఒకరిగా నిలిచి రికార్డ్ సృష్టించారు. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకోవడం వల్ల హార్ధిక్ పేరు గూగుల్ సెర్చ్ లో బాగా పెరిగిందని గూగుల్ తెలిపింది.
అలాగే, ఐపీఎల్ లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినబడిన సంగతి తెలిసినదే. అక్కడినుండి మనోడి పేరు టాక్ అఫ్ ది టౌన్ గా మారడం విశేషం. ఇక వినేష్ ఫోగట్, హార్దిక్ పాండ్యాతో పాటు గూగుల్ లో ఎక్కువగా వెతికిన టాప్ 10లో ఉన్న ఇతర ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ క్రికెటర్లు ఎవరంటే... శశాంక్ సింగ్ (6వ స్థానం), అభిషేక్ శర్మ (9వ స్థానం), బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ (10వ స్థానం) లు ఉన్నారు. వినేష్ ఫోగట్ గురించి తెలిసిందే. వినేష్ ఫోగట్ పారిస్ 2024 ఒలింపిక్స్ అద్భుతమైన ప్రదర్శనతో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరారు.
దేశంలో 2024లో ఇంటర్నెట్లో ఎక్కువ వెతికిన వ్యక్తులు పేర్లు ఇవే:
1) వినేష్ ఫోగట్
2) నీతీష్ కుమార్
3) చిరాగ్ పాస్వాన్
4) హార్దిక్ పాండ్యా
5) పవన్ కళ్యాణ్
6) శశాంక్ సింగ్
7) పూనమ్ పాండే
8) రాధిక మర్చంట్
9) అభిషేక్ శర్మ
10) లక్ష్య సేన్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: