వాస్తులో కేసీఆర్ ని మించిపోతున్న రేవంత్..?

తెలంగాణలో వాస్తు పట్టింపులు ఎక్కువగా ఉన్న సీఎం, పూజలు, యజ్ఞాలు ఎక్కువగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే.  పదేళ్లు తెలంగాణను పాలించిన ఆయన ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. 39 సీట్లకే పరిమితమయ్యారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను గెలిపించలేదు.



 కొత్త సెక్రటేరియేట్‌లో ఆరు నెలలు కూడా కూర్చోలేకపోయారు. తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.  ఏడాది పాలన పూర్తి కావస్తోంది. అయితే ఇప్పుడు ఆయన కూడా వాస్తు దోషం గురించి ఆలోచన చేస్తున్నారు. కొత్త సెక్రటేరియేట్‌లో వాస్తు దోషాలు ఉన్నాయని ప్రజాధనంతో మార్పులు చేస్తున్నారు.  సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. తూర్పువైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన ద్వారాం మూసివేవారు. గేటు తలుపులు తొలగించి.. ఈశాన్యం వైపు ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇనుప గ్రిల్స్‌ తొలగించారు. మిగతా గేట్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.


ఇక డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండనుంది. ఆలోపు వాస్తు మార్పు పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ సెక్రెటేరియేట్‌లో వాస్తు మార్పుల కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ3.20 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.  తూర్పువైపు లుంబినీ పార్కు ఎదుట ఉన్న బాహుబలి గేటును మాత్రమే మారుస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఈ గేటు నుంచే రాకపోకలు సాగించేవారు. ఈ మార్గంలో తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు లాన్, ఫౌంటేయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్యం గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు.


సచివాలయం నిర్మాణం తర్వాత వాస్తు మార్పులు చేయడం ఇదే తొలిసారి అప్పటి సీఎం కేసీఆర్‌ పాత సచివాలయం మొత్త కూల్చి దీనిని నిర్మించారు. రూ.600 కోట్ల ఎస్టిమేషన్‌తో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం మొదలు పెట్టిన కేసీఆర్‌.. పూర్తయ్యే నాటికి రూ.1,200 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఏప్రిల్‌ 30న నాటి సీఎం హోదాలో కేసీఆర్‌ దీనిని ప్రారంభించారు. కేసీఆరే కొత్త సెక్రటేరియేట్‌కు అంచనాకన్నా రెట్టింపు ప్రజాధనం ఖర్చు చేశారు. ఇక ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. కేవలం వాస్తు పేరుతో రూ.3.20 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిని బీఆర్‌ఎస్‌ నేతలు తప్పు పడుతున్నారు. కేసీఆర్‌ వృథా చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు.. కేవలం వాస్తు పేరిట ఇలా డబ్బులు వృథా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: