కర్ణాటకలో కూలనున్న కాంగ్రెస్ ప్రభుత్వం? 50 మంది ఎమ్మెల్యేలు జంప్?
ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కర్ణాటక ప్రభుత్వం సతమతం అవుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇదే అంశంపై ఇటీవల ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే కూడా సీరియస్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా హామీలిచ్చి వాటిని అమలు చేయాలని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ.. వివిధ రాష్ట్రాల మీద కన్నేసి అక్కడి ప్రభుత్వాలను కూలదోసి అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తున్నదని పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. వీటిని బేస్ చేసుకొని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాలని చూసిందని బాంబ్ పేల్చారు. 50 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే.. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అందుకు అంగీకరించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఒప్పుకోకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని అన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని, అసలు వారికి అంత డబ్బు ఎక్కడిది అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఏమైనా డబ్బులు ముద్రిస్తున్నారని అని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీ, జేడీఎస్ నాయకులు పేదలు, మహిళలు, కూలీలు, దోపిడీ, వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని, కేవలం తొలగించేందుకే ప్రయత్నాలు సాగిస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. తనను సీఎం పదవి నుంచి తొలగిస్తే కర్ణాటక ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మరోవైపు.. సిద్ధరామయ్య ఈడీ దర్యాప్తుపైనా స్పందించారు.
చట్టం ప్రకారం తన పని తాను చేసుకుపోతుందని, తాము దర్యాప్తునకు అడ్డు వెళ్లబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నది తప్పుడు కేసు అని అన్నారు. బీజేపీపై కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. గతంలోనూ బీజేపీ పలు రాష్ట్రాలపై కన్నేసి అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు కర్ణాటక మీద తన ప్రతాపం చూపుతున్నదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.