ఇండియాను శాసిస్తున్న ఏకైక టాలీవుడ్ హీరోయిన్‌?

Veldandi Saikiran
రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకరు. రష్మికను ముద్దుగా అందరూ నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. అందం, నటన, అభినయం రష్మిక సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
రష్మిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈ అమ్మడు రిలేషన్ స్టేటస్ ఏంటా అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు. ఈ విషయంపై రష్మిక ఇంతవరకు ఓపెన్ అవలేదు. కానీ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఈ వార్తల పైన విజయ్ కానీ రష్మిక కానీ స్పందించలేదు. కాగా, రష్మిక 1995లో జన్మించింది. మొదటిసారిగా కిరిక్ పార్టీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా రాణిస్తోంది.

రష్మిక నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. గత సంవత్సరం పుష్ప, సీతారామం, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను నూతన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రష్మిక ఉంటే చాలు సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటట్టుగా ఈ బ్యూటీ మారిపోయింది. ఇక రష్మిక మందన నటించే సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది.

బాలీవుడ్ లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ తో వరుసగా సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా తమిళంలో కూడా రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడా చూసుకున్నా రష్మిక మందన హవానే కనిపిస్తోంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్ళు ఏళ్లకు పైనే అవుతుంది. 8 సంవత్సరాల నుంచి తన హవాను కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: