జగన్ చేసిన పనితో అమరావతిలో సంక్షోభం?

రాజధాని అమరావతిలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాల మాట అటుంచి.. నిలిచిపోయిన వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు భారీ కసరత్తులు చేయాల్సి వస్తోంది. ఖర్చు తడిసి మోపడవుతోంది. ఐదేళ్లుగా చెరువుల్ని తలపిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు టవర్లు, హైకోర్టు పునాదుల నుంచి నీటిని తోడేందుకు రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనా.

అమరావతి లో నిలిచిపోయిన పనులు, నిర్మాణాల నాణ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించే బాధ్యతను హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నిపుణులకు సీఆర్డీఏ అప్పగించింది. హైదరాబాద్ ఐఐటీ బృందం నేడు రానుంది. మరో వారంలో ఐఐటీ మద్రాస్ సభ్యులు రానున్నారు. ఐకానిక్ భవనాలుగా తలపెట్టిన సచివాలయం, హెచ్ఓడి టవర్లు, హైకోర్టు పునాదులు పరిశీలిన బాధ్యత మద్రాస్ ఐఐటీకి, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసులు అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణాలు పరిశీలించే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీ కి అప్పగించారు.

ఇన్నాళ్లూ పట్టించుకోకుండా వదిలేసిన భవనాల పటిష్ఠత ఎలా ఉంది. ఐదేళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఇనుప ఊచలు తుప్పు పట్టాయా, నిర్మాణాలను కొనసాగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను హైదరాబాద్ ఐఐటీ నిపుణులు పరిశీలించారు. ఆయా భవన నిర్మాణాల కోసం తీసుకొచ్చిన ఐదేళ్లుగా స్టాక్ యార్డుల్లో మూలుగుతున్న నిర్మాణ సామగ్రి పనికొస్తుందా లేదా అన్నదీ ఆ బృందం నిర్ధారిస్తుంది.

అయితే నిపుణుల బృందం పునాదుల్ని పరిశీలించాలంటే ముందు వాటిలో నీటిని తోడేయాలి. సచివాలయం టవర్ల పునాదుల కోసం 1000 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడెల్పు, 10 మీటర్ల లోతున భారీ గోతులు తవ్వి, వాటిలో 4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేసి పునాదులు నిర్మించారు. హైకోర్టు నిర్మాణ భవనాలను కూడా దాదాపు ఇదే క్వాలిటీతో నిర్మించారు. అయితే ఈ పునాదుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తోడి, ఊరే నీటిని ఎత్తి పోయాలంటే చాలా వ్యయ ప్రయాసతో కూడిన పని. మరి నీరు ఊరుతూ ఉంటే ఆ భవన నిర్మాణాలు ఆగుతాయా. అసలు నిర్మాణాలు పనికి వస్తాయా. నీరు పైపైనే ఉందంటే భవిష్యత్తులో ఇవి మునిగిపోవా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: