ఓహో.. అందుకే బాబు బడ్జెట్ పెట్టకుండా తప్పించుకున్నారా?
ఏపీలో ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ బడ్జెట్ అయితే ప్రవేశ పెట్టడం లేదు. అయిదు రోజుల పాటు స్వల్పకాలికంగా నిర్వహించిన ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం మాత్రం ఉభయ సభలు ఉద్దేశించి బడ్జెట్ సెషన్ సంప్రదాయంగా సాగింది. వాస్తవానికి ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశ పెడతారని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ ను చూసి పెడతారు అని భావించారు.
ఎందుకంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందుతుందని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు అనుకున్నారు. అయితే అమరావతి రాజధానికి రూ.15వేల కోట్లను వివిధ ఏజెన్సీల ద్వారా సమకూర్చుతామని కేంద్రం చెప్పింది. మొత్తంగా ప్యాకేజీ అన్నది ఏమీ లేకుండా పోయింది. మరి ఏం అనుకున్నారో ఏమో కానీ.. బడ్జెట్ ని మాత్రం ప్రవేశ పెట్టలేదు.
ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. అందువల్ల బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రెండు నెలల సమయం పడుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు బడ్జెట్ పెడితే సంక్షేమ పథకాలకు నిధుల వరద పారించాలి. లేకపోతే వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తాయి. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఓటాన్ బడ్జెట్ ను మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నారు.
అయితే దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటాన్ అకౌంట్ తప్ప రెగ్యూలర్ బడ్జెట్ పెట్టే ధైర్యం చంద్రబాబుకి లేదని విమర్శించారు. బడ్జెట్ కూడా రెగ్యూలర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని చురకలు అంటించారు. అందుకే ఏడు నెలల వరకు ఓట్ ఆన్ అకౌంట్ మీద కొనసాగిస్తున్నారని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం అవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మోసపూరిత హామీలకు కేటాయింపులు రెగ్యూలర్ బడ్జెట్ చూపాంచాల్సి వస్తుందని.. అప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి తిరగబడతారు, గళం విప్పుతారు అని అందుకే చంద్రబాబు రెగ్యూలర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని అన్నారు.