మోడీ ఎఫెక్ట్‌.. ఇక అవి కూడా ఇండియాలోనే తయారీ?

భారత దేశంలో హెలికాఫ్టర్ల తయారీకి రంగం సిద్ధం అవుతుంది. ఫ్రెంచ్ విమానాల తయారీ దారు ఎయిర్ బస్ భారత దేశంలో హెచ్ 125 హెలీకాఫ్టర్లను అసెంబ్లింగ్ చేయడానికి టాటా అడ్వాన్స్ డ్ సిస్టం లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట మేడ్ ఇన్ ఇండియా హెచ్ 125ల డెలీవరీలు 2026లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఫార్న్ బరో ఇంటర్ నేషనల్ ఎయిర్ షో 2024లో ఈ ఒప్పందంపై చేసినట్లు.. ఎయిర్ బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ అండ్ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. కంపెనీ భారతదేశంలో హెలీ కాఫ్టర్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది పౌర విమానయాన వృద్ధికి తోడ్పాటుతుందని టాటా అడ్వాన్స్ డ్ సిస్టం లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ అన్నారు. హెచ్ 125 ఫైనల్ అసెంబ్లీ ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ర్టికల్ హార్నెస్ ల ఇన్స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్ లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టం అండ్ ఇంజిన్లు ఏకీకరణ చేపడుతోంది. ఇది హెలీకాఫ్టర్ల టెస్టింగ్ వంటి వాటిని కూడా నిర్వహిస్తోంది.

హెచ్ 125 అనేది ప్రపంచంలో  అత్యధికంగా అమ్ముడవుతున్న సింగల్-ఇంజిన్ హెలికాఫ్టర్. ఈ విభాగంలో హెచ్ 125 అనేది ఇతర హెలికాఫ్టర్ కంటే ముందు ఉంది. ఈ హెలీకాఫ్టర్ స్క్విరెల్ కుటుంబానికి చెందింది. హెచ్ 125 హెలికాఫ్టర్ వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. వీటిని వైమానిక దళాలు మాత్రమే కాకుండా, అగ్నిమాపక, రెస్క్కూ, ఎయిర్ అంబులెన్స్, ప్రయాణికులు రవాణా వంటి వివిధ కార్యకలాపాలతో కూడా విరివిగా ఉపయోగించారు. ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండ్ అయిన ఏకైక హెలికాఫ్టర్ ఇదే కావడం గమనార్హం.  తయారీ కోసం ఎనిమిది ప్రదేశాలను ఎంపిక చేసింది. ఈ ఏడాది చివర్లో వీటికి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: