శభాష్‌.. అందులో దక్షిణ కొరియాను దాటేసిన ఇండియా?

సుదీర్ఘ కాలంగా భారత్ కొన్ని రంగాల్లో వెనకబడే ఉంది. ఇప్పుడిప్పుడే వాటిని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో తయారీ రంగం అత్యంత వెనకబాటుకి గురైంది. కాకపోతే చైనా తయారీ రంగాన్నే నమ్ముకొని టాప్ ప్లేస్  కి చేరింది. డ్రాగన్ తో పాటు మరికొన్ని దేశాలు మ్యాను ఫ్యాక్చరింగ్ రంగంపై దృష్టి సారించి అభివృద్ధి సాధించాయి.

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. 2002-03 లో దేశంలో 1,40,748 ఫ్యాక్టరీలు ఉన్నాయి.  2021-22 నాటికి వీటి సంఖ్య 2,00,575 కి చేరింద. అంటే 43 శాతం పెరిగింది. ఇదే సమయంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీటిల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 1.3 కోట్ల మంది పనిచేస్తున్నారు. వీరిలో నేరుగా నియమితులైన వారి సంఖ్య 81 లక్షల మంది కాగా.. 55 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు. వీరితో పాటు మరికొందరికీ ఉపాధి లభిస్తోంది.

తయారీ రంగంపై మోదీ సర్కారు చూపించిన శ్రద్ధ వర్క్ అవుట్ అయిందని అనిపిస్తోంది. మ్యానుఫ్యాక్చర్ రంగంలో సౌత్ కొరియాను దాటి ఐదో స్థానానికి చేరింది. రూ. 46,58,781 కోట్లతో చైనా తొలి స్థానంలో ఉంది. రూ. 24,97,131 కోట్లతో అమెరికా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. రూ. 8,44,921 కోట్లతో జర్మనీ మూడో ప్లేస్ లో ఉంది. జపాన్ రూ. 8,18,397 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మన దేశానికి వచ్చే సరికి రూ.4,55,766 కోట్లతో ఐదో ప్లేస్ కి చేరింది.

ఇంతకు ముందు ఐదో ప్లేస్ లో ఉన్న దక్షిణ కొరియా రూ.416389 కోట్లతో ఆరు స్థానానికి పడిపోయింది. ఈ తర్వాత ప్లేస్ల్లో మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, రష్యా, టర్కీ, ఐర్లాండ్ లు ఉన్నాయి.  భారత్ ఇప్పుడు టాప్-3 చేరాలన్నా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆ దేశాలకు మనకు చాలా వ్యత్యాసం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: