పెను ప్రమాదంలో.. ఇండియన్‌ యూత్‌.. కళ్లు తెరుస్తారా?

భారత యువత ఒక బబుల్ లో జీవిస్తోందని.. భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ వ్యాఖ్యానించారు. వాస్తవిక అనుభవాలను పొందడం ద్వారా యువత ఆ బబుల్ ని పేల్చేయాలని పిలుపునిచ్చారు. ఒక పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ.. యువతరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని యువత అమాయకులని, మనం భావిస్తున్నాం. కానీ అది నిజం కాదు. భారత్ లోని ఒక నవతరం ఒక బబుల్ లో జీవిస్తోంది. గేటెడ్ సొసైటీల్లో నివసిస్తూ.. గేట్ల బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా ఉన్నారు. ఖరీదైన కార్లలోనే ఆ గేట్లు దాడి బయటకు వెళ్లారు. వారి పాఠశాలలు కూడా బబుల్సే.. అక్కడ విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. తొమ్మిదో తరగతి నుంచే కళాశాల విద్యకు సిద్ధం అవుతున్నారు.

అలా అయితే వారికి ప్రపంచంలో విషయాలు ఎలా అనుభవంలోకి వస్తాయి అని ప్రశ్నించారు. ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందనే విషయాలపై వారు దృష్టి సారించడం లేదు. వృత్తిపరమైన అంశాల్లో వైఫల్యాలను వాస్తవిక ప్రపంచ అనుభవాన్ని పొందడం ద్వారా భారతీయ యువత తమ బబుల్స్ ని పగటగొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ పాడ్ కాస్ట్ వీడియో ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై అతి శ్రద్ధ చూపిస్తున్నారు. అతాగే చదువు ద్వారా వాస్తవిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి. ఎక్కువ అంశాలు పిల్లల బుర్రలోకి ఎక్కించాలని కాకుండా ప్రపంచంలోని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి సారించేలా వారిని తీర్చిదిద్దాలి అని ఒకరు రాసుకొచ్చారు. ఆ బబుల్ అనేది అన్ని చోట్లా లేదని కొందరికే పరిమితం అని మరొకరు రాసుకొచ్చారు. అయితే భారత యువత దీన్ని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో ప్రమాదం ఎంతో గ్రహించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: