చంద్రబాబు.. "సూపర్‌ సిక్స్‌" సంచలనం ఎన్నడో?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వని మెజార్టీని ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. కూటమి శ్రేణుల్లో అంతులేని ఆనందం కనిపించింది. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఆనందించిన దగిన  అంశాల్లో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. దీంతో పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు గురించి ఏపీలో చర్చ జరుగుతోంది.

ఏపీలో సూపర్ సిక్స్ హామీలతో ఎన్డీయే కూటమి గెలుపు సాధించింది. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన లు సాధించిన సీట్లు పలువురి దృష్టిని ఆకర్షించాయి. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించింది. మరి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల గురించి ఏం చేయబోతున్నారు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్, గృహ జ్యోతి  వంటి పథకాలు అమలు అవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 40  రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటీ కూడా అమలు కాలేదు. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెడుతున్నారు. దీనిని పక్కన పెడితే..

ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. అమ్మ ఒడి పథకం డబ్బులు ఇంకా జమ కాలేదు.  ఈ పథకానికి సంబంధించిన మార్గ దర్శకాలు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆయా పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు మంజూరు చేస్తే.. వారికి కొంత సహాయంగా ఉంటుంది. ప్రస్తుతం పెరిగిన పింఛన్లు మాత్రమే ఇస్తున్నారు తప్ప మరే పథకం అమలు కాలేదు. అలాగే అమ్మ ఒడితో పాటు మిగతా పథకాలపై ఏమైనా రివ్యూ చేస్తారా.. ఎప్పటి లోపు వాటిని ప్రారంభిస్తారు వంటి వివరాలతో టైం షెడ్యూల్ ని ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: