చైనా దివాలా తీయబోతోందా.. పరిస్థితి దారుణంగా ఉందా?

ప్రపంచంలోనే  రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా కొంత కాలంగా డీలా పడింది. కొవిడ్ అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ దేశ అగ్రనాయకులు ఇప్పటికే వెల్లడించారు. ఇదే అంశంపై ఆ దేశాధినేత షీ జిన్ పింగ్ కూడా స్పందించారు. ఆర్థిక సవాళ్ల మాట నిజమేనని అంగీకరించారు.
చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ అంది. దీంతో పాటు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. పీడబ్ల్యూసీ చైనాలోని బీజింగ్, షాంఘై తో పాటు ఇతర చైనా నగరాల్లో తమ ఆఫీసులను మూసి వేస్తోంది. ఇప్పటికే దాదాపు 100 మంది ఆడిటర్లతో పాటు ఇతర స్టాఫ్ ను ఉద్యోగాల నుంచి తొలగించింది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడిటింగ్ విషయంలో పీడబ్ల్యూసీ సరిగా లేదని చైనా వాదిస్తుండగా.. తమకి తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్లే ఆడిటింగ్ సరిగా లేదని పీడబ్ల్యూసీ బదులు ఇస్తోంది.  
చైనాలో పరిస్థితులు మునపటిలా లేవు కానీ చైనా నిజాలు చెప్పదు అనేది వాస్తవం. వారం నుంచి ఒక సంచలన వార్త ప్రచారంలో ఉంది. చైనాకి చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించినట్లు వార్త సారాంశం. దానిలో భాగంగా గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు, వాటి విడి భాగాలను చైనాకు ఎగుమతి చేయడంపై జర్మనీ నిషేధం విధించింది.
మ్యాన్ఫ్యాక్చర్ సెక్టార్ ను ప్రస్తుతం కొనసాగిస్తున్న యూరప్ దేశాలు, ఆఫీస్ యాక్టివిటీని మాత్రం క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. చైనా నుంచి అరబ్ , ఇతర దేశాలకు తరలి పోతున్నాయి. వీటి ప్రభావం చైనాపై గట్టిగానే పడుతుంది. తద్వారా చైనాలోని ధనవంతులు, అపర మిలియనర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఫలితం సంక్షోభం దిశగా సాగుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సాక్ష్యం అక్కడి చైనా దేశస్థులే వాళ్ల సోషల్ మీడియాలో గతంలో తమ వైభవం ఎలా ఉంది.. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి వివరిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: