సొంత జిల్లాపై ఆ తెలంగాణ మంత్రికి ఎంత ప్రేమో?

తుమ్మల నాగేశ్వరరావు ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మూడు ప్రభుత్వాల్లో మంత్రి పదవులను పొంది తనమార్క్ చూపించారు. గతంలో టీడీపీ హయాంలో.. భారాస ప్రభుత్వంలో.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో అమాత్య కొలువు పొందారు. అయితే ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఏ అభివృద్ధి చూసిన తుమ్మల మార్క్ లేకుండా ఉండదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించినా జిల్లాకు మాత్రం నిధులు తెచ్చి పెడుతుంటారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం తన జీవిత ఆశయం అని పలు సందర్భాల్లో తుమ్మల వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్లుగానే పనులు పూర్తి చేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా వర ప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టు చివరి దశకు చేరింది. ట్రయిల్ రన్ కూడా పూర్తైంది. ఆగస్టు 15 నాటికి లింక్ కెనాల్ కు అనుసంధానించి గోదావరి జలాలు అందించేందుకు సర్వం సిద్ధమైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టు మొదటి పంపు హౌస్ వద్ద ట్రియిల్ రన్ ను ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరీశీలించారు. గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండటంతో ఆయన పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు నమస్కరించారు. త్వరగా పనులు పేర్తి చేసి నీటిని అందించాలని నీటిపారుదల శాక అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అని అన్నారు. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలనేదే తన కోరికగా చెప్పారు.  

సీతారామ ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపిన తుమ్మల.. అధికారులు రేయింభవళ్లు కష్టపడ్డారని అభినందించారు. ఈ వర్షాకాలంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆగస్టు 15 కల్లా ప్రాజెక్టు పూర్తి అయి గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో టీడీపీ హయాంలో తుమ్మల సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం.. అయినా తుమ్మలకు మంత్రి పదవులు దక్కడంతో ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: