పవన్‌ ప్లాన్‌ తెలిస్తే.. చంద్రబాబు బిత్తరపోవాల్సిందేనా?

ఏపీలో జనసేన అధికార భాగస్వామిగా ఉంది. వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని దీని కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. చెప్పినట్లు త్యాగాలు చేసి, చివరకు వైసీపీని ఓడించి తన పంతం నెగ్గించుకున్నారు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి. నెక్స్ట్ టార్గెట్ సీఎం పదవేనా.. ఆ కోరిక ఇప్పట్లో తీరేదేనా అంటే..

కాపులకు రాజ్యాధికారంతో మొదలై ఆ తర్వాత పెద్దన్న పాత్ర నినాదంతో ఆరంభించిన పవన్.. తనను నమ్మాలని, నా వ్యూహాలను అర్థం చేసుకొని తనకు అండగా నిలవాలని కోరారు. ఈ క్రమంలో అందరూ ఆయనకు బాసటగా నిలిచి బరిలో ఉన్న అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించి 100 స్ర్టైక్ రేట్ అందించారు. ఇప్పుడు ఆయన వ్యూహం ప్రస్పుటంగా కనిపిస్తుంది.

చంద్రబాబు ఉన్నంత కాలం ఆయనే ఏపీ సీఎం. ఇందులో మరే సందేహం లేదు. అదే సందర్భంలో పవన్ డిప్యూటీ సీఎం. ఇదే లాంగ్ స్టాండింగ్ వ్యూహం. అప్పటి వరకు పవన్ కు అనుభవం వస్తుంది.  అందుకే 2040 లక్ష్యాన్ని ఇరు పార్టీలు విధించుకున్నాయి. ఆ తర్వాత తన అనుభవాన్ని అడ్డం పెట్టుకొని తనను ఆశీర్వదించాలని పవన్ ప్రజలను కోరే అవకాశం ఉంది. 2014లోనే రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది. గతంతో పోల్చుకుంటే పార్టీ బలం గణనీయంగా పెరిగింది.

కాకపోతే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి చెరో 40 శాతం సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. అది 2019, 2024 ఎన్నికల్లో నిరూపితం అయింది. మిగతా 10 శాతం ఓటర్లే అధికారాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం కింగ్ మేకర్ అయ్యే ఓటు బ్యాంకు జనసేనకు ఉంది. అధికారం చేపట్టాలంటే ఈ ఓటు బ్యాంకు సరిపోదు.  మరి ఇంతటి బలమైన పార్టీలను తట్టుకొని నిలబడాలంటే ఇప్పట్లో అయ్యే పనికాదు.  అందుకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ప్రస్తుతం పవన్ అదే అనుసరిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: