ట్రంప్‌పై కాల్పులు.. ఇండియాలో ఏదో జరుగుతోందా?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని వంతెనపై కొన్ని గంటల పాటు వేచి ఉంచిన ఘటన మనందరికీ తెలిసిందే. సీఏఏ, వ్యవసాయ చట్టాలకు నిరసనగా కొన్ని నెలల పాటు జాతీయ రహదారుల దిగ్భందనం చేసి, నిరసనలు చేయడాన్ని మనం చూశాం. వీటితో పాటు రైళ్ల దాడులు ఇవన్నీ జరుగుతుండగా వీటన్నింటిని దాటుకొని దేశంలో సార్వత్రిక ఎన్నికలు అంత సులభంగా, శాంతియుతంగా ఎలా జరిగాయో అర్థం కావడం లేదు.

రోజూ దేశ వ్యాప్తంగా కొన్ని వందల సభలు, ర్యాలీలు జరిగాయి. ఇక ఎస్పీజీ, పోలీసులు, రా, నిఘా సంస్థలు ఎంత నిబద్ధతతో పనిచేస్తేనో మన దేశంలో ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరిగాయో.  ఇంతటి శక్తిమంతమైన వ్యవస్థను దాటుకొని ప్రత్యర్థులు, ఉగ్ర వాదులు చొచ్చుకొని లోపలకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా అవకాశం దొరికినా సమయం కోసం ఎదురు చూస్తున్నారా అనే సందేహం వస్తోంది.  ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అంటే ఆ దేశానికే కాదు.. ప్రపంచానికే నాయకత్వం వహించే వ్యక్తి.  ఆ పదవికి పోటీ పడాలంటేనే ఎన్నో అర్హతలు ఉండాలి.

అంత పెద్ద అగ్రదేశం అమెరికాలోనే భారీ రక్షణ వలయాన్ని దాటుకొని ఆ దేశ అధ్యక్షుడిగా పోటీ చేసే వ్యక్తిపై తుపాకీతో దాడి జరిగింది. అలాంటిది మన దేశంలో ఎటువంటి చిన్న తప్పిదం జరగకుండా ఎన్నికలు జరిగాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పుడప్పుడూ సంఘ విద్రోహ శక్తులు పరీక్షలు చేస్తూ నిశ్శబ్ధంగా ఉన్నారేమో అనిపిస్తోంది.

ఇటీవల ఎన్నికల్లో ఇండియా కూటమి అరకొర సీట్లను సాధించింది. అయినా ఆ కూటమి నేతలు వీటిపై రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. పైగా ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారు.  కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపుర్, కశ్మీర్  ఈ రాష్ట్రాల గుండా దేశ విద్రోహ శక్తులు సులభంగా దేశంలోకి రాగలరు. ఒకరు పార్లమెంట్లోకి దూరి పొగ బాంబు వేసే ప్రయత్నం చేశారు. మరొకరు ఎర్రకోటపై జాతీయ జెండానే తొలగించాడు. ఈ పరిణామాలను చూస్తుంటే మొత్తానికి దేశంలో ఏదో జరగబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: