ఆ ఒక్క బుల్లెట్‌ దెబ్బతో ట్రంప్‌ ప్రెసిడెంట్‌ సీట్లో పడిపోయినట్టేనా?

డొనాల్డ్ ట్రంప్ అదృష్టవంతుడేనా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఆయన ప్రాణాలను కాపాడుకొని బయట పడ్డ సంఘటన చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ట్రంన్ ని షాట్ పెట్టి మరీ తుపాకీతో కాల్చడానికి ధామస్ మాథ్యూ కూక్స్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు చేసిన ప్రయత్నం విఫలం అయింది. దానికి కారణం సెకెన్ లో వెయ్యో వంతు అన్నట్లు ట్రంప్ తలను ఆ టైంలో అటు తిప్పడం.

ట్రంప్ హెడ్ కి టార్గెట్ చేసి వెళ్లిన ఆ బుల్లెట్ కాస్తా చెవి పక్కన రాసుకొని దూసుకు పోయింది. దాంతో స్వల్ప గాయంతో ట్రంప్ బయట పడ్డారు. అదే టైంలో క్రూక్స్ ని గురి పెట్టిన భద్రతా దళాలు నిందితుడిని మట్టుబెట్టాయి. ట్రంప్ ఆ సమయంలో తల తిప్పి ఉండకపోతే ఆయన తలలో నుంచే బుల్లెట్ దూసుకొని వెళ్లేది. ఇదిలా ఉండే ట్రంప్ ఎనభైకి దగ్గరలో ఉన్నారు. ఆయన చెవికి గాయపై తీవ్ర రక్త స్రావం అయినా ఆయన లేచి నిలబడ్డాడు.

తద్వారా తన డేరింగ్ నేచర్ ని ఆయన చాటి చెప్పాడు. అంతే కాదు తన మద్దతుదారులను ఉద్దేశించి ఫైట్ అనే నినాదాలు చేయడం ద్వారా తన స్పిరిట్ ను చూపించారు. అయితే ట్రంప్ ని చంపేందుకు నిందితుడు 48 గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు విచారణ అధికారులు చెప్పారు. క్రూక్స్ మొత్తం 50 రౌండ్ల బుల్లెట్లు, ఒక నిచ్చెనని కొనుగోలు చేశాడు. నిందితుడు తన చివరి రెండు రోజులు బాగానే గడిపాడు.

అయితే ట్రంప్ విషయంలో పక్కా మ్యాథ్ మెటిక్స్ ఉపయోగించే దాడికి తెగబడ్డాడు అని అధికారులు వివరించారు. ఎలా అంటే ఎటు నుంచి చూసినా కూడా ట్రంప్ తలే లక్ష్యంగా కనపడేలా ఒక ప్లేస్ ని ఎంపిక చేసుకున్నాడు. పక్కా లెక్కలతో షూట్ చేశాడు. రెప్పపాటు లో ట్రంప్ తల వేరేవైపు తిప్పకపోతే.. అతడి తలలో నుంచే బుల్లెట్ చొచ్చుకుపోయేది. ఈ రకంగా చెప్పాలంటే ట్రంప్ నిజంగా అదృష్టవంతుడే. పైగా దాడి తర్వాత సింపతీ పెరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: