జగన్ హీరో.. పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ హీరో?

సొంతిల్లు చక్కబెట్టుకోకుండా పక్కవారి విషయాల్లో తల దూర్చి అడ్డంగా బుక్ అవ్వడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది కేటీఆర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే. తన పార్టీ విషయాల గురించి మీడియాతో తప్పించుకోబోయి.. వేరే పార్టీ విషయాల్లో వేలు పెట్టారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఎలాంటి సమాచారం లేకుండా సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలో జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమి తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.  ఈ క్రమంలో వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో జగన్ హీరో, షర్మిళ జీరో అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రజలకు మంచి చేసినా ఓడిపోయారన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పథకాలు అమలు చేశారని…అయినా ఎందుకు ఓటమి పాలయ్యారో అర్థం కావడం లేదన్నారు.

ఏపీ ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ హీరో అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని అది సాధారణ విషయం కాదన్నారు. 40 శాతం మంది ఓటర్లు జగన్ వెంటే ఉన్నారు. వైఎస్ షర్మిళకు అసలు నాయకత్వ లక్షణాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు జగన్ గెలుస్తారనే సమాచారం తమకు ఉందని.. అయినా ఓటమి పాలవడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు.

అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 40 శాతం ఓట్లు సాధించని జగన్  హీరో అయితే అంతకు మించి మెజార్టీ సాధించి 164 సీట్లు పొందిన కూటమి నేతలు ఏం అవుతారని ప్రశ్నిస్తున్నారు.  పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డులు సృష్టించిన పవన్ కల్యాణ్ సూపర్ హీరోనా అని అడుగుతున్నారు. వైసీపీకి మించి ఓటు బ్యాంకు సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుని ఏం అని సంబోధిస్తారు అని కేటీఆర్ ను విమర్శిస్తున్నారు. ఒక్కశాతం ఓటు బ్యాంకు పొందిన షర్మిళతో జగన్ ను పోల్చి ఏం చెప్పదలచుకున్నా అర్థం కావడం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. మొత్తం మీద జగన్ హీరో కామెంట్లతో అడ్డంగా బుక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: