నల్గొండ జిల్లాలో వందల ఎకరాలు కబ్జా చేసిన బీఆర్‌ఎస్‌ మంత్రి?

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధరణిలో పెట్టి నల్లగొండ జిల్లాలో వందల ఎకరాల కబ్జా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. ఈయన ప్రస్తుతం ధరణి కమిటీలో పని చేస్తున్నారు. త్వరలో జగదీష్ రెడ్డి బండారం బయట పడుతదన్న కోదండ రెడ్డి.. త్వరలోనే ధరణి లో జరిగిన అక్రమాలు అన్ని త్వరలో బయటికి వస్తాయన్నారు.

కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అంటున్న కోదండ రెడ్డి.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందన్నారు. మంచి విషయాన్నికూడా కోతిలాగా మాట్లాడుతుండన్న కోదండ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తుండన్నారు. అధికారం కోల్పోయినాక కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తుండన్న కోదండ రెడ్డి.. మీ నిర్వాకంతో 18లక్షల ఎకరాల భూమిని పార్ట్ బీ లో పెట్టిండ్రన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ధరణి పోర్టల్ లో చేసిన నిర్వాకంతో లక్షల కుటుంబాలు బజారున పడ్డాయని కోదండ రెడ్డి అన్నారు.

ఐటీ మంత్రిగా కేటీఆర్ రే సంతకం పెట్టిండని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిజమైన సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు ఇవ్వలేదని కోదండ రెడ్డి విమర్శించారు. ఆ నిర్వకానికి కేసీఆర్, కేటీఆర్ భాద్యులని కోదండ రెడ్డి అన్నారు. వాస్తవాల కోసం సబ్ కమిటీ వేస్తే కేసీఆర్, కేటీఆర్‌ల కేంటి ఇబ్బందని కోదండ రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిండ్రని కోదండ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ను పదవి నుంచి దింపిన అంశాల్లో ఈ ధరణి ఒకటిగా చెప్పుకోవచ్చు. భూముల వివరాల కంప్యూటీకరణ పేరిట.. వందల, వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ధరణిలో అక్రమాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విచారణలో ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: