సీఎం అంటే కొత్త అర్థం చెప్పిన కేటీఆర్‌.. రేవంత్‌ తల ఎక్కడ పెట్టుకోవాలో?

సీఎం అంటే కటింగ్‌ మాస్టర్‌ అంటూ రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి గారు... cm అంటే కటింగ్ మాస్టరా అంటూ సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా.. ఇదే cm అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ల్లు పేల్చారు. నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు.. నేడు 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు.. పాసుబుక్కులు లేవనే నెపంతో... లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. రేషన్ కార్డు సాకు చూపి... లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

మొన్న.. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారన్న మాజీ మంత్రి కేటీఆర్.. నిన్న.. 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని విమర్శించారు. నేడు...2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి... లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదన్న మాజీ మంత్రి కేటీఆర్.. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని వెటకారం చేశారు.

కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు.. అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారని విమర్శించిన కేటీఆర్.. రుణమాఫీపై మాట తప్పినా... మడమ తిప్పినా...లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: