బీజేపీ కోరిన ఆ మూడు కోరికలు చంద్రబాబు తీరుస్తారా?

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తాజాగా చంద్రబాబు ప్రభుత్వాన్ని మూడు కోరికలు కోరుతోంది. తాజాగా చంద్రబాబును కలిసిన ఆ పార్టీ నేతలు.. ఆయన ముందు మూడు డిమాండ్లు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి 3 వినతులపై వినతి పత్రాలు ఇచ్చారు. ఇంతకీ అవి ఏమిటంటే.. గత 5ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన మద్యం మాఫియాపై సమగ్ర విచారణ జరపాలనేది మొదటి కోరిక.. అలాగే గత 5ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఇసుక మాఫియాపై సమగ్ర విచారణ జరపాలనేది రెండో కోరిక. ఈ రెండింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మొదటి రెండు కోరికలు కోరింది.

ఇక మూడో కోరిక మాత్రం పర్సనల్‌ కోరిక కోరింది. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోరుతూ మూడో విజ్ఞాపన పత్రాన్ని చంద్రబాబుకు బీజేపీ నేతలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయన్ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మేరకు తమ కోరికలు బయటపెట్టారు. బీజేపీ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు  కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పురంధరేశ్వరి, సీఎం రమేష్ కూడా వచ్చారు.

ప్రతీ ఒక్కరికీ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించిన చంద్రబాబు.. తన చేత్తో  ప్రతీ ఒక్కరికీ ప్లేట్లు అందచేస్తూ అందరితో కలిసి భోజనం చేశారు. ఎన్నికలు జరిగిన తీరు, అంతా కలసి కట్టుగా పడిన కష్టం గురించి చంద్రబాబు, బీజేపీ నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ఐదేళ్ల వైసీపీ వేధింపులను సుజనా చౌదరి ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే.. వైసీపీ వేధింపులకు అన్ని వర్గాలు బాధితులేనని చంద్రబాబు ఆయనతో అన్నట్టు తెలిసింది.

ఇదే సమయంలో అనపర్తిలో ఉపాధి హామీ నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానన్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చంద్రబాబుతో అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభించేస్తావంటూ అభినందించినట్టు తెలిసింది. నల్లమిల్లి బీజేపీ నుంచి గెలిచినా ఆయన చివరి నిమిషంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: