జగన్‌ ఇచ్చిన ఐఏఎస్‌ లిస్టు బాబు వెనక్కి తీసుకుంటారా?

ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు జగన్‌ సర్కారు కొందరు అధికారుల జాబితాను కేంద్రానికి పంపింది. యూపీఎస్సీకి జాబితా పంపి.. వారిలో కొందరిని ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా కన్‌ఫర్డ్‌ చేయాలని సిఫారసు చేసింది. అయితే.. అప్పట్లోనే దీనిపై వివాదం చెలరేగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ పని చేయడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. జగన్ తనకు నచ్చిన అధికారులను సిఫారసు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అయితే.. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే గత ప్రభుత్వం సిఫార్సు చేసిన రాష్ట్రకేడర్  సివిల్ సర్వీసెస్ జాబితాను వెనక్కు తీసుకుని కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఐఎఎస్ పదోన్నతులకు సిఫార్సు చేసి యూపీఎస్సీకి జాబితా పంపిందని.. దొడ్డిదారిన ఏపీ రాష్ట్ర సివిల్ సర్వీసు కేడర్ ఐఎఎస్ అధికారిగా ఓ మహిళా గుమస్తా పేరును సిఫార్సు చేశారని  కేఆర్ సూర్య నారాయణ అంటున్నారు.
గత ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి కార్యదర్శి పేరును కూడా ఐఏఎస్ జాబితాలో చేర్చి పంపారన్న  కేఆర్ సూర్య నారాయణ.. దీని వెనుక విశ్రాంత ఐఎఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారన్నారు. అఖిల భారత సర్వీసులోకి పదోన్నతిలో పక్షపాతం జరక్కూడదని ఇంటర్వూలు నిలుపుదల చేయాలని సీఎం చంద్రబాబు యూపీఎస్సీకి కూడా లేఖ రాశారని  కేఆర్ సూర్య నారాయణ గుర్తు చేశారు.

చంద్రబాబు లేఖతో సదరు ఇంటర్వూలను జూన్ 25 తేదీకి యూపీఎస్సీ వాయిదా వేసిందన్న  కేఆర్ సూర్య నారాయణ.. ఇంటర్వూలు వాయిదా వేయటం వల్ల అర్హులకు న్యాయం జరగదన్నారు. దొంగ అభ్యర్ధులకు యథాతథంగా ఇంటర్వూలు జరిగితే అర్హులకు అన్యాయం జరిగినట్టేనని కేఆర్ సూర్య నారాయణ అంటున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి లేఖ రాసిందని  కేఆర్ సూర్య నారాయణ గుర్తు చేశారు. దీన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్వాగతిస్తోందని  కేఆర్ సూర్య నారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: