జగన్.. వాటిని పూర్తిగా గాలికొదిలేశారా?

ఏ ప్రభుత్వం అయినా విజయాలు ఉంటాయి. అపజయాలు ఉంటాయి. ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని ఎవరూ అనలేరు. కానీ విపక్షాలు మాత్రం చేయని వాటినే జనాల్లోకి తీసుకెళ్తారు. ప్రభుత్వం మంచి చేస్తే ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని. అయితే అధికారం కోల్పోయిన వెంటనే గత ప్రభుత్వంలో వైఫల్యాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుంటాయి.

గత వైసీపీ ప్రభుత్వం చివరిలో ఆసుపత్రుల్లో మెడికల్ స్టాఫ్, వైద్యుల నియామకాలను భారీ ఎత్తున చేపట్టారు. అయితే బోధనాసుపత్రుల నిర్వహణను మాత్రం పట్టించుకోలేదనే అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వహయాంలో బోధనాసుపత్రి లో అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వాటిని పాలకులు విస్మరించారు.  బోధనాసుపత్రుల అభివృద్ధి,  కొత్తగా ఏడు కళాశాలల నిర్మాణాలు వసతి కల్పనకు రూ.12వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైసీపీ ప్రభుత్వం అంచనా వేసింది.

ఇందులోనే బోధనాసుపత్రులకు రూ.3820 కోట్లను ప్రత్యేకించాలని ప్రణాళికలో రూపొందించారు. కానీ రూ.199 కోట్ల విలువైన పనులనే చేపట్టారు. ప్రతిపాదనల మేరకు నెల్లూరు జీజీహెచ్ విశాఖ మెయిన్స్ లో నిర్మాణాలు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. మరోవైపు రూ.8వేల కోట్లతో కొత్త వైద్యశాలలు నిర్మించాలని తలచినా.. కేవలం రూ.1429 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది.  కొత్త కళాశాలల పనుల కోసం రూ.1616 కోట్లను మంజూరుకు రుణ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.

పీజీ సీట్లు పెంపునకు తగ్గట్లు రూ.755 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్ఫత్తుల్లో వెచ్చించాలి. ఈ మేరకు కేంద్రం ఇచ్చే నిధులను వాటికి సంబంధితన పనులకు వెచ్చించ కుండా నాడు నేడు పనులకు మళ్లించారు.  రాష్ట్రంలో వైద్య, విద్యా బోధకుల కొరతను పూర్తిగా విస్మరించి.. కొత్తగా కళాశాలల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమే విస్మయానికి గురి చేసింది. అయితే కళాశాలల నిర్మాణమే పూర్తి కానప్పుడు నియామకాలు ఎలా జరుగుతాయి అనే లాజిక్ ను మిస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: