చిత్తుగా ఓడినా.. అక్కడ మాత్రం జగన్‌ బాబును దెబ్బ కొడతాడా?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూట గట్టుకుంది. గత లోక్ సభ ఎన్నికల్లో 22 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఈసారి నాలుగు స్థానాలకే పరిమితం అయింది. అసెంబ్లీలో సైతం 151 నుంచి 11 సీట్లకు దారుణంగా దిగజారింది. ఈ పరిణామాలతో అటు అసెంబ్లీలో.. ఇటు లోక్ సభలో ఆ పార్టీ పట్టు కోల్పోయింది.  

అయితే ఈ దెబ్బతో వైసీపీ ఉనికి కోల్పోయిందా అంటే లేదనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే 2019లో ఆ పార్టీకి దక్కిన ఘన విజయం కారణంగా ఇప్పుడు వైసీపీ మట్టి కరిచినా.. అటు మండలిలో..ఇటు రాజ్యసభలో వైసీపీ తిరుగు లేకుండా పోయింది. శాసన మండలిలో మెజార్టీ అంతా వైసీపీకే ఉంది. మరో రెండేళ్ల పాటు వేరే పార్టీ తరఫున ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు. ఇలా చూసుకుంటే  చంద్రబాబు సర్కారును అసెంబ్లీలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేకపోయినా.. చేయకపోయినా.. శాసన సభలో మాత్రం నిలువరించవచ్చు.

దీంతో టీడీపీ వచ్చే రెండేళ్ల పాటు ప్రతి బిల్లు విషయంలో వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. దీంతో చంద్రబాబు నిర్ణయాలకు మండలిలో బ్రేకులు పడే అవకాశం ఉంది. గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలను అచ్చం ఇలానే.. టీడీపీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్దల సభలో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండటం ఆ పార్టీకి అతి పెద్ద సానుకూలాంశం.

అందుకే ఆ పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్సీలతో భేటీ అయి తగు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రభోలాలకు లోను కావద్దని వివరించారు. ప్రస్తుతం మండలి లెక్కలు చూసుకుంటే.. 58 స్థానాలకు గానూ.. వైసీపీకి 42 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి 12 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రులు ఇద్దరు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని టీడీపీ భర్తీ చేసుకుంటుంది కాబట్టి మొత్తం టీడీపీ బలం 14 కి చేరుతుంది. దీంతో గతంలో టీడీపీ అనుసరించిన వ్యూహాన్నే వైసీపీ నేడు అమలు చేయనుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: