చంద్ర‌బాబు డెసిష‌న్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌లో వ‌ణుకు మొద‌లైందా..?

RAMAKRISHNA S.S.
అదేంటి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంటి.. ?  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయ‌న త‌న‌యుడు.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లో వ‌ణుకు మొద‌లవ్వ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా ? అక్క‌డే ఉంది అస‌లు క‌థ‌. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ - జ‌నసేన - బీజేపీ కూట‌మి అప్ర‌తిహ‌త విజ‌యం సాధించి.. క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. ఈ విజ‌యంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదే శం కేడ‌ర్‌లో ఎక్క‌డా లేని జోష్ క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఏపీలో ఇప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండ‌దు.. లోకేష్ ఫ్యూచ‌ర్ కు సైతం ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని తేలిపోయింది. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు దృష్టి తెలంగాణ మీద ప‌డిన‌ట్టు గా తెలుస్తోంది. తెలంగాణ లో ఉన్న బీసీల్లో ఇప్ప‌ట‌కీ తెలుగుదేశం పార్టీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీరంతా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తే కాంగ్రెస్ గెలిచింది. ఇక పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇప్పుడు తెలంగాణ పార్టీని స్ట్రాంగ్ చేయాల‌న్న డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అదే జ‌రిగితే గ‌తంలో తెలుగుదేశం పార్టీలో ఉండి.. ఆ త‌ర్వాత బీఆర్ ఎస్‌లోకి వెళ్లిన చాలామంది టీడీపీ నాయ‌కులు.. మాజీ , ప్ర‌స్తుత ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటు కేడ‌ర్ అంతా తిరిగి తెలుగుదేశం వైపు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొంద‌రు ఇప్ప‌టికే ఆ దిశ‌గా ఆలోచ‌న కూడా చేస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే ముందుగా బీఆర్ఎస్‌కు బ్యాండ్ ప‌డిపోతుంది. చంద్ర‌బాబు ఇక్క‌డ ఎంట్రీ ఇస్తాడ‌న్న వార్త‌లే ఇప్పుడు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని.. అస‌లే గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకోని బీఆర్ఎస్‌కు ఇది మ‌రింత చావు దెబ్బ అని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: