రుషికొండ ప్యాలెస్ కట్టింది ఆ మహిళనే...దగ్గరుండి డిజైన్ చేయించిందా?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి...ప్రభుత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో... ఆయననే తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన... అవకతవకలను తవ్వితీస్తూ... ఏపీ ప్రజల ముందు పెడుతోంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగానే ఋషికొండ పైన జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనాల గురించి... టిడిపి విమర్శలు చేస్తోంది. ఈ భవనాల కోసం ఏకంగా 450 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని... తన సొంత లగ్జరీ లైఫ్ కోసం... ఆ భవనాలను కట్టుకున్నాడని ఆరోపణలు చేస్తోంది.
ఇక మరి కొంతమంది తెలుగుదేశం టిడిపి నాయకులు అయితే... వైయస్ భారతి కోసం ఆ ప్యాలెస్ ను జగన్మోహన్ రెడ్డి నిర్మించాడని... చెబుతున్నారు. విశాఖలోని ఋషికొండ పై పర్యాటకశాఖ పేరు చెప్పి.. తన కుటుంబం కోసమే ఈ భవనాలను నిర్మించుకున్నాడని  మండిపడుతోంది టీడీపీ. రాజుల కాలం నాటి... కట్టడాలు ఇక్కడ కట్టారని... కేవలం ఒక్క బాత్రూం కి 26 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసినట్లు టిడిపి మండిపడుతోంది.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి.. జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా సరికొత్త అంశాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భవనాలను నిర్మించడానికి... ఏ కాంట్రాక్టర్ కు డబ్బులు ఇచ్చారని.. టిడిపి ప్రశ్నిస్తోంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారికే ఈ కాంట్రాక్టు ఇచ్చారని కూడా టిడిపి చెబుతోంది.
ముఖ్యంగా ఈ ప్యాలెస్... ఇంటీరియర్ పనులను... చెవ్వ  సుప్రియ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్లు... టిడిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐటి సలహాదారుగా పనిచేసిన దేవి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి సతీమణినే ఈ సుప్రియ రెడ్డి అని... టిడిపి చెబుతోంది.  జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు అయిన పులివెందులకు సంబంధించిన వారట ఈ సుప్రియ రెడ్డి. కేవలం ఇంటీరియర్ డిజైన్ కోసం... ఆమె 120 కోట్ల వరకు... ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ... టిడిపి మాత్రం ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: