పవన్ కళ్యాణ్ క్యాంప్‌ ఆఫీస్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా...?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదేళ్ల తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటా కూడా భారీ విజయాలు సాధించింది. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా గెలిచింది. పవన్ వల్లే చంద్రబాబు మళ్ళీ సీఎం కాగలరు. అందుకే బాబు పవన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పవన్‌ను ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ఉప ముఖ్యమంత్రిగా నియమించారు, దాంతో ఆయన ప్రత్యేక క్యాంపు కార్యాలయంతో సహా పదవి ప్రయోజనాలను అనుభవిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఆయనకు లభిస్తుంది.
అయితే ఈరోజు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్.. ముగ్ధులయ్యారు. నిజానికి ఈ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు చాలా కృషి చేశారు. టాలీవుడ్ అత్యంత ప్రతిభావంతులైన ఆర్ట్ డైరెక్టర్లలో ఒకరైన ఆనంద్ సాయిని క్యాంప్ ఆఫీసులో కాస్మెటిక్ మార్పులు చేయడానికి నియమించుకున్నట్లు సమాచారం. ఆనంద్ పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు. హరి హర వీర మల్లు చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ కూడా.  అతనికి పవన్ గురించి బాగా తెలుసు. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్‌లో అతని ప్రాధాన్యతలను అర్థం చేసుకున్నాడు.
క్యాంప్ ఆఫీస్ ఇంటీరియర్స్ కోసం ఆనంద్ పవన్ కళ్యాణ్ ఇష్టపడే కలర్ ప్యాలెట్‌ని ఉపయోగించాడని, పవన్ అతడి పనికి ఫిదా అయ్యారని సమాచారం. భవనానికి పెద్దగా మార్పులు చేయనప్పటికీ, పవన్ అభిరుచుల ఆధారంగా కావాల్సినంత కాస్మెటిక్ టచ్-అప్‌లు జరిగాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పవన్ ప్రధానంగా ఇక్కడి నుంచే పని చేస్తారు. ఆనంద్ సాయి డిజైన్ చేసిన క్యాంపు ఆఫీసు ఇప్పుడు అద్భుతంగా ఉందని చాలామంది అంటున్నారు.
ఏది ఏమైనా పవన్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ పోలీసు ఆఫీసర్ల చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నారు. డిప్యూటీ ఆఫీసులో సింహం లాగా కూర్చొని ప్రజలకు న్యాయం చేయబోతున్నారు. పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం చాలా సంతోషిస్తున్నారు. పవన్ ను ఏపీ డిప్యూటీ సీఎం గా చూడటం చాలా బాగుందని కానీ పెడుతున్నారు. త్వరలో అతనే సీఎం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పవర్ స్టార్ చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అని సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: