మళ్లీ మోదీ గెలిస్తే.. దేశంలో ఇంత రచ్చ జరుగుతుందా?

రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలిచి మరోసారి సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఉవ్విళూరుతుంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన అని బీజేపీ విమర్శలు చేస్తోంది.

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతుంది. అందుకే ఆ పార్టీ 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుందని విమర్శిస్తోంది. గత ఐదేళ్లుగా దేశంలో నెలకొన్న పలు పరిణామాలను ప్రస్తావిస్తూ.. మరోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేసి సరికొత్త రాజ్యాంగాన్ని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరికి బీజేపీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించినా.. పార్టీ ఉద్దేశంగా ఇండియా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఇందులో భాగంగా.. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని చెప్పారు.

ఒకవేళ బాబా సాహెబ్ అంబేడ్కర్ వచ్చినా ఇప్పుడు దీనిని రద్దు చేయలేరని చెప్పుకొచ్చారు. రాజస్థాన్ లోని బార్మర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వం అని మోదీ అన్నారు. మరోవైపు రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే పార్లమెంట్ లో బీజేపీకి భారీ మెజార్టీ అవసరం అని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి. కాకపోతే ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బీజేపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా. విపక్షాలు మాత్రం వాయించి వదిలేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: