పవన్‌: బాబుకోసం.. బాబు కంటే ఎక్కువ తలవంచుతున్న సేనాని?

జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే పవన్ కల్యాణ్ టికెట్లు ఇస్తున్నారు. అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అనుసరించిన ఆయన.. రేపు పాలకొండలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జగన్ పై ద్వేషం ఉంది. ఎంతలా అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా విమర్శించేంతలా. జనసేనాని ఎజెండా ఆయన సీఎం కావడం కాదు. జగన్ ను గద్దె ఎక్కకుండా చూడటం. ఈ  విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికలు చంద్రబాబుకి అత్యంత కీలకం. ఎందుకంటే అధికారంలోకి రాకపోతే ఆయన జైలుకి వెళ్లడం పక్కా. టీడీపీ ఛిన్నాభిన్నం అవుతుంది. ఆ భయంతోనే రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు.

ఈ సమయంలో త్యాగాలు చేయాల్సింది చంద్రబాబు. కానీ టీడీపీ అధినేత కోసం జనసేనాని బీజేపీ పెద్దల వద్ద మాటలు పడుతున్నారు. సీట్లు కోల్పోతున్నారు. పార్టీ భవిష్యత్తునే ఫణంగా పెడుతున్నారు. పొత్తులో భాగంగా ముందు జనసేనకి కేటాయించిన సీట్లు 24 అసెంబ్లీ, మూడు లోక సభ. ఆ తర్వాత కోత పెట్టి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీని లాగేసుకున్నారు.

పోనీ మిగిలిన 21 సీట్లలో ఏమైనా పదిహేనేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలకి ఇచ్చారా అంటే అదీ లేదు. టీడీపీ, జనసేన నుంచి వచ్చిన నేతలకు కేటాయిస్తూ.. తన పార్టీని నమ్ముకున్న వారిని అన్యాయం చేస్తున్నారు. మొత్తంగా లెక్కేసుకుంటే పదకొండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాల్లో జనసైనికులు పోటీ చేస్తున్నారు. మిగతా సీట్లన్నీ చంద్రబాబు చెప్పిన వారికి. . మిగతా పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించారు. మరి ఇదేం స్ర్టాటజీనో పవనే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: