ఏపీ: అప్పుల వీరుడు బాబు.. అతడిని మించిన జగన్‌?

అప్పు ఏ దేశానికి అయినా అవసరమే. అంతటి అగ్రరాజ్యం అమెరికా సైతం ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు తీసుకుంటుంది. ఆ అప్పును సకాలంలో చెల్లిస్తుంది. ఇలా చేస్తే తప్పేమీ కాదు. మనం కూడా ఓ ఇల్లు, కారు, బండి ఇలా మన అవసరానికి సంబంధించి ప్రతి విషయానికి అప్పులు చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత చెల్లిస్తూ ఉంటాం. అయితే ఇదే సూత్రం రాష్ట్రాలకు, దేశాలకూ వర్తిస్తూ ఉంటుంది.

అయితే ఈ తీసుకొచ్చే అప్పును తీర్చలేకపోతేనే  ప్రమాదం. ఓ శ్రీలంక, పాకిస్థాన్.. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు తెచ్చిన అప్పులను సకాలంలో చెల్లించలేక దివాళా తీశాయి. మళ్లీ ఆ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు జనాలపై పన్నుల భారాన్ని మోపుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ప్రభుత్వాలు తీసుకొచ్చే అప్పులపై ఎప్పటికప్పుడు మీడియా వార్తలను రాస్తూ ఉంటుంది. కాకపోతే తెలుగునాట మీడియా స్టైల్ వేరు కదా..

ఏపీని సీఎం జగన్ అప్పుల కుప్ప చేశారు. ఎప్పకప్పుడు అప్పులు తెస్తున్నారు. ఇదే మా చంద్రబాబు ఉంటే.. అప్పులు తెచ్చేవారు కాదు. భవిష్యత్తు తరాలకు లేకుండా సీఎం జగన్ మొత్తం వాడేస్తున్నారు. ఇలా ఉంటాయి కొన్ని పత్రికల వక్రీకరణలు. ప్రభుత్వానికి రాష్ట్ర నిర్వహణకు సంబంధించి అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏపీ విషయంలో ఓ వర్గం మీడియాకు ఇది నచ్చడం లేదు.

అయితే గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం దిగిపోయే ముందు అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని చెప్పారు. ఈ నెల జీతాలకే రూ.3 నుంచి 4 వేల కోట్ల వరకు కావాలి అని చెప్పేశారు. ఏపీ విభజన సమయంలో రూ.90వేల కోట్ల అప్పుతో విడిపోతే.. టీడీపీ దానిని రూ.నాలుగన్నర లక్షల కోట్లకు పెంచింది. టీడీపీ హయాంలోను, ప్రస్తుత వైసీపీ పాలనలోను ఓవర్ డ్రాఫ్ట్ లోనే ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. 365 రోజుల్లో 341 రోజులు ఏపీ ప్రభుత్వం అప్పు చేసిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు హయాంలోనే పరిస్థితి ఇలానే కొనసాగిందని విశ్లేషకులు లెక్కలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: