బాబు: చీప్‌, క్వాలిటీ మద్యం.. అద్దిరిపోయే ఇంకొన్ని ఐడియాలు?

మహిళలు మద్యపాన నిషేధం చేయాలని చాలా ప్రాంతాల్లో కోరుతూ ఉంటారు. వారి ఓట్లను దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా మద్యపాన నిషేధం చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. అలాంటిది ఓ మహిళా అభ్యర్థి పేదలకు ఉచితంగా విస్కీ, బీరు లాంటివి ఇస్తామని చెబితే ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి . తాజాగా మహారాష్ట్రలో  ఓ మహిళా అభ్యర్థిని అలాంటి హామీనే ఇచ్చారు మరీ.

మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని చిమూర్ గ్రామానికి చెందిన అభ్యర్థి వనితా రౌత్ తనను 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు రాయితీపై విస్కీ, బీరు అందజేస్తామని విచిత్ర ఎన్నికల హామీని ప్రకటించింది. అఖిల భారత మానవతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆమె తమ ప్రాంతంలోని పేద ఓటర్ల కోసం ఈ ఎన్నికల వాగ్దానాన్ని అందించారు. తాను విజయం సాధిస్తే ఎంపీ నిధుల నుంచి పేదలకు దిగుమతి చేసుకున్న విస్కీ బీరు ఉచితంగా అందజేస్తానని ప్రకటించేశారు.

రేషన్ సిస్టం ద్వారా దిగుమతి చేసిన మద్యాన్ని ఇస్తామని పేర్కొన్నారు. పేద ప్రజలు కష్టపడతారని.. మద్యపానంతో మాత్రమే వారు స్వాంతన పొందుతారని అని వివరిస్తున్నారు. కానీ వారు నాణ్యమైన విస్కీ లేదా బీరు ను కొనుగోలు చేయలేరు. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యాన్ని అందించాలని  భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే దీనిని చంద్రబాబుకి ముడిపెడుతూ.. కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలు చేస్తే దానిని చంద్రబాబు ఎత్తేశారు. 2014కి వచ్చే సరికి బెల్టు షాపులు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 2024కి వచ్చే సరికి నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇస్తున్నారు. అది కూడా చౌక ధరలకే అంటూ మద్యం ప్రియులకు ఆఫర్ ప్రకటిస్తున్నారు.  వనితా రౌత్ ఇచ్చిన హామీని చంద్రబాబు కూడా ప్రకటిస్తే బాగుంటుందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: